Sarpanch Attack woman in Basara : నిర్మల్ జిల్లాలో దారుణం.. మహిళపై దాడి చేసిన సర్పంచ్ - నిర్మల్ జిల్లా వార్తా విశేషాలు
🎬 Watch Now: Feature Video


Published : Oct 9, 2023, 10:45 PM IST
Sarpanch Attack woman in Basara : నిర్మల్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్.. మహిళపై దాడి చేశాడు. బాసర మండలం కిర్గుల్ (కె) గ్రామ సర్పంచ్ దేవేందర్.. దళిత మహిళపై కడుపులో తన్నడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయం భూమి పూజకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరయ్యారు.
అదే సమయంలో దళిత మహిళలు.. తమ గ్రామంలో దళిత బంధు కొందరికే ఇవ్వడం సరికాదని ఘర్షణకు దిగారు. తమకు దళిత బంధు ఇవ్వకపోయినా.. కనీసం అంబేడ్కర్ భవనం కట్టి ఇవ్వాలని ఎమ్మెల్యే వద్దకు వినతి పత్రాన్ని ఇవ్వడానికి సదరు మహిళ వెళ్లింది. దీంతో ఆగ్రహించిన గ్రామ సర్పంచ్ కడుపులో తన్నారని బాధితురాలు పేర్కొంది. సర్పంచ్‌తో పాటు మరో ముగ్గురు కూడా దాడి చేయడంవల్ల.. సదరు మహిళకు గాయాలు కావడంతో బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన తనను.. ఎమ్మెల్యే కళ్ల ముందే తనపై సర్పంచ్ దాడిచేశారని బాధితారులు పేర్కొంది. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది.