Sachin Statue In Wankhede : లాఫ్డెడ్​ షాట్​ ఆడుతున్నట్లు సచిన్ విగ్రహం.. వీడియో చూశారా? - sachin wankhede relation

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 9:39 PM IST

Sachin Statue In Wankhede : మహారాష్ట్ర.. ముంబయి వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయనున్న మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ విగ్రహం అహ్మద్​నగర్​లో రూపొందుతోంది. ఈ విగ్రహాన్ని శిల్పి ప్రమోద్ కాంబ్లే.. సుందరంగా తయారు చేస్తున్నారు. బ్యాట్ పట్టుకొని లాఫ్టెడ్ షాట్ ఆడుతున్న పోజులో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. కాగా, నిర్మాణ పనులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. తెందూల్కర్ ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విగ్రహాన్ని నవంబర్ 1న వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్​సీఏ (ముంబయి క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షులు ఇటీవలే ప్రకటించారు.

వాంఖడేతో సచిన్ అనుబంధం.. సచిన్ సొంత రాష్ట్రం మహారాష్ట్ర కావడం వల్ల ముంబయి వాంఖడేతో అనుబంధం ఏర్పడింది. సచిన్ చిరకాల స్వప్నం వన్డే ప్రపంచకప్​ కల నెరవేరింది కూడా ఈ మైదానంలోనే. 2011 వరల్డ్​కప్​ శ్రీలంకతో.. భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది ఇక్కడే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికింది కూడా వాంఖడేలోనే. ఇక ఇప్పటికే ఈ స్టేడియంలో ఆయన పేరిట 'సచిన్ రమేశ్ తెందూల్కర్' స్టాండ్ ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.