Viral Video Road Accident in Hyderabad : ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వ్యక్తి మృతి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్ - viral video in hyderabad
🎬 Watch Now: Feature Video

RTC Bus Hit Bike at Rahamathnagar : ద్విచక్రవాహనాన్ని.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతువాత పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రహమత్‌నగర్ సర్కిల్ వద్ద బోరబండ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాదారుడు ప్రమాదస్థలిలోనే మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు, కండక్టర్ పరారైనట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి.. మల్లేశ్ s/oపెంటయ్యగా గుర్తించారు. మృతుడు స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. రహమాత్‌నగర్ డివిజన్లోని కార్మికనగర్ ఎన్జీటిలో నివాసం ఉంటున్నట్లుగా తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముఖ్య కారణం.. అతివేగమేనని స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదంతో యూసుఫ్‌గూడ వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.