కేసీఆర్ లక్కీ నంబర్ ప్రకారం - తన మనవడికి ఆరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు : రేవంత్ రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-11-2023/640-480-20107267-thumbnail-16x9-revanth-reddy-election.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 24, 2023, 10:20 PM IST
Revanth Reddy Participated in Aleru Election Campaign : రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలని.. ముఖ్యమంత్రి లక్కీ నంబర్ ప్రకారం తన మనవడికి ఆరో పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ సభ అనంతరం.. ఆలేరులో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విజయభేరి సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తన ఇంట్లోని అందరికీ ఉద్యోగాలు కల్పించిన సీఎం చంద్రశేఖర్ రావు.. తెలంగాణ కోసం పోరాడిన యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ నిట్టూర్చారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి గురించి మాత్రం ఏనాడూ ఆలోచించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో కేసీఆర్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. నిరంకుశ నేతలను బండకేసి కొట్టే శక్తి ప్రజలకే ఉందని.. ఓటు అనే ఆయుధాన్ని సరిగా వినియోగించుకోవాలని రేవంత్ ప్రజలకు సూచించారు. అధిక మెజారిటీతో ఆలేరులో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.