డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి - ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారు : రేవంత్ - Revanthin graduation ceremony Ambedkar College
🎬 Watch Now: Feature Video
Published : Dec 22, 2023, 2:28 PM IST
Revanth Reddy Interesting Comments on Politics : హైదరాబాద్ బీఆర్ అంబేడ్కర్ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కాకా వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన సీఎం, పట్టభద్రులకు పట్టాలు అందించారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్‌ను చూసినప్పుడు రామాయణంలో లవకుశులు గుర్తొస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ నిర్మాణంలో కాకా సామాజిక బాధ్యతను నిర్వర్తించారని ఆయన గుర్తు చేశారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు, విద్యను అందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదని రేవంత్‌రెడ్డి కొనియాడారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరవచ్చని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా, రాష్ట్రంలో కాకా కుటుంబం పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.