కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని కేసీఆర్ తప్పుడు మాటలు చెప్తున్నారు : రేవంత్ రెడ్డి - రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన
🎬 Watch Now: Feature Video
Published : Nov 17, 2023, 4:28 PM IST
Revanth Reddy Election Campaign in Kodangal : రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వివరించారు. పేదల ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
Revanth Reddy Explain SIX Guarantees : కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు కింద ఎకరానికి ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా(Revanth Reddy on Rythu Bharosa) కల్పిస్తామని చెప్పారు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని.. రైతులు పంట రుణాలు కట్టొద్దని.. తాము అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మేలు జరిగే ఆరోగ్యశ్రీని కేసీఆర్ చంపేశారని.. తాము వస్తే ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచి పటిష్టంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.