Revanth Reddy Contest from Kamareddy : 'హై కమాండ్ ఆదేశిస్తే.. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా' - KCR latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 26, 2023, 1:30 PM IST
Revanth Reddy Contest from Kamareddy : ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్‌పై పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ తొలి జాబితాలో ప్రకటించింది. తాజాగా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడుతో పాటు, గజ్వేల్‌లో సీఎంపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కేసీఆర్ పోటీ చేసే రెండు అసెంబ్లీ స్థానాలు.. తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.
Revanth Reddy on Telangana Assembly Elections 2023 : అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. తానైనా, భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొడంగల్‌లో పోటీ చేయాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించానని.. కొడంగల్‌లో పోటీకి కేసీఆర్ రాకపోతే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎప్పుడూ హంగ్‌కు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణలోనూ హంగ్ ఎప్పుడూ రాలేదని.. ఈ ఎన్నికల్లో మూడింట రెండో వంతు మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.