ప్రమాణస్వీకారం చేయలేదని అధికార కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్ - అధికారికంగాఏర్పాటు చేసిన కాన్వాయ్‌ని వద్దన్నరేవంత్
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 9:31 AM IST
Revanth Reddy At Begumpet Airport : దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ (వాహనశ్రేణి)ని సిద్ధం చేయగా రేవంత్ రెడ్డి వద్దని వారించారు. తాను ఇంకా ప్రమాణ స్వీకారం చేయనందున వద్దంటూ తనతోపాటు దిల్లీ నుంచి వచ్చిన మాణిక్‌రావ్ ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
Revanth Reddy New Convoy At Begumpet Airport : కానీ భద్రతా కారణాల రీత్యా కాన్వాయ్‌ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమదంటూ డీజీపీ తదితర అధికారులు వాహనశ్రేణితో రేవంత్ రెడ్డి వాహనాన్ని అనుసరించారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చర్చించారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.