హైదరాబాద్‌లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్ - ప్రారంభించిన నీతా అంబానీ - Nita Ambani Hyderabad News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-11-2023/640-480-19981016-thumbnail-16x9-neeta-hyderabad.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 9, 2023, 12:07 PM IST
Reliance Retail First Swadesh Store In Hyderabad : హైదరాబాద్‌లో రిలయన్స్ రిటైల్ తొలి స్వదేశ్ స్టోర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. చేతివృత్తులతో పాటు సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించేందుకు.. దేశంలోనే తొలి స్వదేశ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.
First Swadesh Store In Jubilee Hills : జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ల్లో 'స్కాన్ అండ్ నో' సాంకేతికత ద్వారా ప్రతి ఉత్పత్తి, ఆ వస్తువుల తయారీదారు వివరాల్ని తెలుసుకోవచ్చని నీతా అంబానీ వెల్లడించారు. హైదరాబాద్ తమకు ఎంతో ప్రత్యేకమన్న నీతా అంబానీ.. తమ రిలయన్స్ రిటైల్ మొదటి స్టోర్‌ని సైతం ఇక్కడే ప్రారంభించిన్నట్లు గుర్తుచేశారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రామ్ చరణ్, ఉపాసన , మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, సినీ నటి మంచు లక్ష్మి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పి.వి. సింధూ, సైనా నెహ్వాల్, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.