'సీఎం కేసీఆర్ నిరుద్యోగుల కలను చెదరగొట్టారు - అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాల భర్తీ' - రణదీప్ సుర్జేవాలా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 2:10 PM IST
Randeep Surjewala Fires On KCR : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగం, ఉపాధి కోసం.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి హైదరాబాద్ గాంధీభవన్‌లో సమావేశంలో పాల్గొన్న సూర్జేవాలా మాట్లాడుతూ.. పదేళ్లలో సీఎం కేసీఆర్ నిరుద్యోగుల కలను చెదరగొట్టారని.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
Randeep Surjewala Election Campaign in Telangana : భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రణదీప్ సూర్జేవాలా హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్జేవాలా స్పష్టం చేశారు.