శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. 'కోట్లాది మంది భక్తుల పోరాటం కారణంగానే..'
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు.. శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. సోషల్ మీడియో వేదికగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి.. చంపత్ రాయ్ వీటిని విడుదల చేశారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని రామ మందిరం అభివృద్ది పనులకు సంబంధించిన అప్డేట్ను భక్తులతో పంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. రామ మందిర నిర్మాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో భక్తులకు తెలిపే ప్రయత్నం చేశామన్నారు. 'శతాబ్ద కాలంగా కోట్లాది మంది రామభక్తులు సాగించిన నిరంతర పోరాటం కారణంగా.. ఇప్పుడు శ్రీ రాముడి గొప్ప ఆలయం రూపుదిద్దుకుంటోంది' అని ట్రస్ట్ విడుదల చేసిన ఫొటో, వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. రాముడి ఆలయ నిర్మాణ పనులు, వాటి పురోగతి గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.. ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ వస్తోంది.