raja singh: 'నా మెంటాలిటి ఏ పార్టీతో సరిపోదు.. ఒక్క బీజేపీతో తప్ప'
🎬 Watch Now: Feature Video
rajasingh clarification on party changing: తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. టీడీపీలోకి వెళ్లాలని కనీసం ఆలోచన కూడా చేయలేదని స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత ఇచ్చేది హిందూ ధర్మానికేనని...ధర్మం సేవ చేయాలనేదే తన ఉద్దేశమని భాజపా తప్ప తనలాంటి వ్యక్తులను ఏ పార్టీ తీసుకోదని రాజాసింగ్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. తన మెంటాలిటీ ఏ పార్టీతో సరిపోదన్నారు. భాజపా జాతీయ నాయకత్వం విధించిన సస్పెన్షన్ ఎప్పుడూ ఎత్తి వేస్తుందో తెలియదని పేర్కొన్న రాజాసింగ్... కేంద్రమంత్రులు బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం అండగా ఉందన్నారు. గోషామహల్ నియోజకవర్గం నుంచే భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు.
'నిన్న సాయంత్రం నుంచి రాత్రి ఒంటిగంట వరకు మధ్యప్రదేశ్‌లోని ఒక కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నాడని నిన్న ఒక వార్త క్లిక్ అయ్యింది. అలాంటిదేం లేదు. అలాంటి ఆలోచన కూడా నేనెప్పుడూ చేయలేదు. నా మెంటాలిటికీ ఏ పార్టీ కూడా మ్యాచ్ కాదు. ఒక్క బీజేపీ తప్ప నాలాంటి వ్యక్తులను ఏ పార్టీ వాళ్లు కూడా తీసుకోరు. సస్పెన్షన్ వేటు నాపై ఎప్పుడు తీసేస్తారనేది తెలియదు. కానీ బీజేపీ నాయకులందరూ నా వెంట ఉంటూ.. భరోసానిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు.'