Rajasingh at BJP Office : 'రామునికి వనవాసంలాగే.. నాకు పార్టీ వనవాసం ముగిసింది' - Telangana ASSEMBLY ELECTIONS
🎬 Watch Now: Feature Video
Published : Oct 22, 2023, 5:39 PM IST
|Updated : Oct 22, 2023, 6:56 PM IST
Rajasingh at BJP Office : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh ) సంవత్సరం తరువాత రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. గత ఏడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్నారు. ఇవాళ ఆయనపై అధిష్ఠానం సస్పెన్షన్ ఎత్తివేసింది. దీంతో పాటు మళ్లీ అదే నియోజకవర్గం(గోషామహల్)లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ ఖరారు చేసింది.
Rajasingh Go to BJP Office after one Year : బీజేపీ తొలి జాబితా(BJP FIRST LIST)లోనే రాజాసింగ్కు టికెట్ కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన కార్యకర్తలతో భారీగా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. కచ్చితంగా గతంలో కంటే మెరుగైన మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తనపై నమ్మకం ఉంచినందుకు గెలిచి తీరుతారని హామీ ఇచ్చారు. రామునికి వనవాసంలానే.. పార్టీ కూడా తనకు వనవాసం విధించిందని.. ఇప్పుడు ముగిసిందని సంతోశం వ్యక్తం చేశారు.