Rain Problems in Hyderabad : ఆగని వానలు.. నీట మునుగుతున్న కాలనీలు
🎬 Watch Now: Feature Video
Colonies flooded in Hyderabad : గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దంచి కొడుతున్న వానలతో పలు చోట్ల కాలనీలు నీటమునిగాయి. కుత్భుల్లాపూర్ గాజులరామారంలోని ఒక్షిత్ ఎంక్లేవ్లోకి మోకాళ్లోతు నీరు వచ్చిచేరింది. గడిచిన రాత్రి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. కాలనీలో వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాక్స్ నాలా పనులు అర్ధాంతరంగా, ప్రణాళిక లేకుండా మధ్యలో మొదలు పెట్టడంతో ఈ పరిస్థతి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్‌గంజ్, కిషన్‌గంజ్, మహరాజ్‌గంజ్, ఫిల్ఖాన, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరుకుపోయాయి. పటేల్‌నగర్‌లోని సాయికృష్ణ అపార్ట్‌మెంట్‌లోనికి నీరు చేరడంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోండాపుర్, కోత్తగుడా మణికొండ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. రహదారులపై మ్యాన్‌హోల్స్ పోంగిపోర్లుతున్న కారణంగా రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు భయాందోళన చేందుతున్నారు. వరదనీరు నిలిచిన చోట ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మరో మార్గంలోకి మళ్లిస్తున్నారు.