అకస్మాత్తుగా వర్షం, ఇబ్బంది పడిన వాహనదారులు - శీతాకాలంలో వర్షం
🎬 Watch Now: Feature Video
Published : Nov 7, 2023, 9:49 PM IST
|Updated : Nov 7, 2023, 9:56 PM IST
Rain in Hyderabad Today : హైదరాబాద్లోని సాయంత్రం సమయాన వర్షం అకస్మాత్తుగా విరుచుకుపడింది. ఒక్కసారిగా వర్షం పడడంతో భాగ్యనగరవాసులు చలికి వణికిపోయారు. చల్లటి వాతావరణంలో మరికొందరు సరదాగా చిల్ అయ్యారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, గోషామహల్, గచ్చిబౌలి, మాదాపూర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, కొండాపూర్.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పనికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటున్న సమయంలో పడడం వల్ల నగరవాసులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
Hyderabad Weather Report Today : హైదరాబాద్లో కురిసిన వర్షం వల్ల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు తడిచిపోయారు. మరోవైపు నల్గొండ జిల్లాలో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఫలితంగా రహదారులు జలమయమయ్యాయి.
Heavy Rain in Khammam : ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చింతకాని, ముదిగొండ, ఖమ్మం, రఘునాథపాలెం, కోనిజర్ల మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నగరంలో సుమారు గంట పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్ కూడలి, మయూరి కూడలి తదితర ప్రాంతాల్లో నీరు రోడ్డుపైకి చేరింది. ఈ అకాల వర్షాలకు పత్తి పంట నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.