Puvvada Fires on Congress Party : 'కాంగ్రెస్ పార్టీ మా పథకాలనే కాపీ కొట్టి.. మళ్లీ మమ్మల్నే కాపీ క్యాట్ అంటోంది' - బీఆర్ఎస్ మేనిఫెస్టోపై పువ్వాడ స్పందన
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 8:09 PM IST
Puvvada Fires on Congress Party : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి.. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఖమ్మంలో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీలను తమ పార్టీ కాపీ కొట్టిందని అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తుత్తునియలు అయ్యాయని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశంలో అనేక చోట్ల అమలు చేసుకుంటున్నారని పువ్వాడ పేర్కొన్నారు. రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందన్నారు. ఎవ్వరూ ఊహించని పథకాలతో ప్రజల సంక్షేమం కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని చెప్పారు. దేశంలో ఎవ్వరూ అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని.. లోక్‌సభ సభ్యులు నామ నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేసి తీరిందని వెల్లడించారు.