Professor Kodandaram Fire on BRS Government : రెండు, మూడు రోజుల్లో టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల : కోదండరామ్ - సీఎం కేసీఆర్ పై ప్రొఫెసర్ కోదండరామ్ ఫైర్
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 8:58 PM IST
Professor Kodandaram Fire on BRS Government : రాష్ట్రంలో సహజ వనరులు కొల్లగొట్టడం.. ప్రభుత్వం 9 ఏళ్ల పాలన స్వభావమని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆక్షేపించారు. ప్రజాస్వామ్య పాలన కావాలి.. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలు పంచుకోవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము నిర్వహించే ప్రతి సమావేశాన్ని ఎన్నికల కోడ్ పేరిట ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. విపక్షాలు సమావేశాలు పెడితే ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతూ ఎక్కడ తీవ్రమైన విమర్శలు చేస్తారన్న భయంతో.. కేసీఆర్ సర్కారు ఎక్కడిక్కడ అడ్డుకుంటుందని ఆరోపించారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడానికి ఎన్నికల కోడ్ అనేది ఏ మాత్రం ఆటంకం కాదని, వాస్తవాలు ప్రజలకు ఎన్నికలప్పుడు చెప్పకపోతే ఇక ఎప్పుడు చెబుతామని అన్నారు. విస్తృత కసరత్తు చేసిన దృష్ట్యా రెండు, మూడు రోజుల్లో టీజేఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కోదండరామ్ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ, ప్రజా, మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు, నిరుద్యోగ ఐకాస నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం.. టీఎస్‌పీఎస్‌సీ వైఫల్యం వల్ల ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి మర్రి ప్రవళిక ఉదంతం పట్ల సాగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.