గత ప్రభుత్వం తప్పిదాలు వల్లే భూ సమస్యలు : కోదండరామ్
🎬 Watch Now: Feature Video
Published : Dec 10, 2023, 7:20 PM IST
Prof Kodandaram Speech at Deputy Collectors Meeting : గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో అనేక రంగాల్లోని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు ఏం లాభం అని లెక్కలు వేసుకుని పనులు చేశారే తప్ప పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నడూ కృషి చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో జరిగిన ఓ హోటల్‌లో నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Deputy Collectors Meeting at Begumpet : గత ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని వాస్తవంగా దోషులు ఎవరో చెప్పాల్సిన అవసరం తమపై ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తామని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో పూర్వ వైభవం రావాలని కోరుకుంటామని నూతన ఒరవడి వస్తుందని అన్నారు. గ్రామాల భూములు సమస్యలు పరిష్కారం చేయడమే తమ లక్ష్యమన్నారు.