Producer Adiseshagiri Rao met Nara Bhuvaneshwari: భువనేశ్వరీతో భేటీ అయిన సినీ నిర్మాత ఆదిశేషగిరి రావు.. జగన్ పాలనలో కొత్త తరహా కక్ష రాజకీయాలంటూ వ్యాఖ్య
🎬 Watch Now: Feature Video
Producer Adiseshagiri Rao met Nara Bhuvaneshwari: రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఆయన కుటుంబసభ్యుల్ని ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు.. ఆదిశేషగిరి రావు పరామర్శించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూశానన్న ఆయన.. ఈ తరహా కక్ష సాధింపు రాజకీయాలు వారి మధ్యలేవని అన్నారు. జగన్ పాలనలో కొత్త తరహా కక్ష రాజకీయాలు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలు లేని చంద్రబాబు అరెస్టు అక్రమమని, జరిగిన ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి చెప్తే, తన జీవితంలో ఇదో బాధాకర ఘటన అన్నారన్నారు. సజ్జల, ఇతర సలహాదారుల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలే ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పోలీసులు, అధికారులు చేసే అన్ని తప్పిదాలకు రేపు ఈ ముఖ్యమంత్రే బాధ్యత వహిస్తాడా అంటూ నిలదీశారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆదిశేషగిరిరావు హితవుపలికారు.
Congress leader Sailajanath meet Bhuvaneshwari: నారా భువనేశ్వరిని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు తీరును ఖండిస్తూ సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో పగ ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని.. ఎక్కడా పరిపాలన కనిపించట్లేదని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతో గొప్పదని.. ఆయన్ని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు.