ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాటకు ప్రియాంక గాంధీ చప్పట్లు - ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 27, 2023, 7:32 PM IST
Priyanka Gandhi Dance for Revanth Reddy Song : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు తమపై పాటలు రాయించుకుంటూ వాటిని ప్రచారాల్లో ప్రజలకు విసిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లి ఫోటోలు దిగి.. ముచ్చట్లు పెడుతున్నారు. ఒకపక్క ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలపై ఎక్కుపెడుతూనే.. ప్రజల్లోకి వెళుతున్నారు. సోమవారం కొడంగల్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి పాటకు చప్పట్లు కొడుతూ.. కార్యకర్తల్లో జోష్ నింపారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇదివరకే మధిర రోడ్‌షోలో పాల్గొన్న ప్రియాంక గాంధీ గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేశారు. అవి ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండగా.. తాజాగా రేవంత్ రెడ్డి పాటకు చప్పట్లు కొడుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. తెలంగాణలో రేపటితో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక వేర్వేరుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోనున్నారు.