' బొల్లారంలో 120 అడుగుల ఫ్లాగ్​పోస్ట్​ను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము' - ద్రౌపది ముర్ము హైదరాబాద్ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 6:48 PM IST

President Droupadi Murmu Unveils 120 Feet Flagpost In Hyderabad : హైదరాబాద్‌ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 120 అడుగుల ఫ్లాగ్‌పోస్ట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. 1948 లో హైదరాబాద్​ను భారతదేశంలో కలిపినప్పుడు హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్​కే వెల్లోడి బాధ్యతలు స్వీకరించే సమయంలో ఈ జెండాను ఎగరవేశారు. దాని స్థానంలో తిరిగి కొత్త జెండాను మళ్లీ ఈరోజు ఆవిష్కరించారు. శిలా ఫలకాన్ని మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఆ ప్రాంతమంతా రాష్ట్రపతి కలియ తిరిగారు. 

Waterfall Was Inaugurated By President Droupadi Murmu : అక్కడే సందర్శన గ్యాలరీలో ఏర్పాటు చేసిన పలు ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు. దాంతో పాటు మేజ్‌గార్డెన్‌ కమ్‌ మ్యూజికల్‌ ఫౌంటెన్‌, మొట్ల బావి పునరుద్ధరణ చేసి నీటిని తోడే పద్ధతిని ప్రారంభించారు. అనంతరం శివుడు, నంది విగ్రహాలపై జలాభిషేకం చేసేలా వాటర్‌ఫాల్‌ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. ఆ విగ్రహాల వాటర్‌ఫాల్‌ ముందు పోటోలు దిగారు. మ్యూజియంలో పురాతన వస్తువులు, ఇతర విషయాలను అధికారులు రాష్ట్రపతికి వివరించారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.