హైదరాబాద్‌లో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన - వీడ్కోలు పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి - వీడ్కోలు పలికిన గవర్నర్ సీఎం రేవంత్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Dec 23, 2023, 1:48 PM IST
President Draupadi Murmu Return To Delhi : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన ముగిసింది. హకీంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 18 నుంచి నేటి వరకు హైదరాబాద్ బొల్లారంలో ఉన్నారు. ఇవాళ ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.
CM Revanth Reddy Send Off To President Murmu : ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ద్రౌపది ముర్ము పర్యటనలో భాగంగా పోచంపల్లిని సందర్శించారు. థీమ్ పెవిలియన్ పార్కులో చీరల తయారీ యూనిట్‌కు వెళ్లి అక్కడ కార్మికులు మగ్గాలపై నేస్తున్న చీరలను ఆసక్తిగా పరిశీలించారు. నేత కార్మికులతోనూ ముచ్చటించారు. ఆనవాయితీలో భాగంగా బొల్లారంలోని తన నివాసంలో రాష్ట్రపతి శుక్రవారం తేనీటి విందు(ఎట్ హోం)ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇతర ప్రముఖులు హాజరయ్యారు.