Ambedkar Jayanti 2023 : ఓరుగల్లులో రాజ్యాంగ పీఠికను చూశారా..? - Constitution Preamble in warangal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 14, 2023, 2:16 PM IST

Ambedkar Jayanti celebrations in Warangal: రాజ్యాంగ రచించిన వ్యక్తిగా పేరుపొందిన అంబేడ్కర్​ అందరికీ ఆదర్శ ప్రాయడయ్యారు. ఊరూ, వాడా ఆయన విగ్రహాలు నెలకొల్పి ఆయనును స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నడిబొడ్జును 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలికొల్పి.. దళితులపై తమ ప్రేమను, అభిమానానాన్ని చాటుకుంటోంది. 

వరంగల్​లో అంబేడ్కర్ కూడలిలోనూ అంబేడ్కర్ మహనీయతను తెలిపై ఓ ఆవిష్కరణ ఉంది. అదేంటంటే.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ పీఠిక నమూనాను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పీఠిక స్థానికులను అలరిస్తోంది. వారాంతాలు, సెలువు దినాల్లో ఈ ప్రదేశంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం ధర్నాలతో దద్దరిల్లే ఈ ప్రాంతం.. సాయంత్రమవగానే సందర్శకులతో కిటికటలాడుతుంది. రాజ్యాంగం రచించిన మహనీయుడి గురించి రాబోయే తరాల వారికి తెలియజేసేందుకే ఆ పీఠిక ఏర్పాటు చేసినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. మరోవైపు వరంగల్​ నగర కూడలిలో అంబేడ్కర్​ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.