Pratidwani Discussion on BRS Candidates List : బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం - KCR Strategy
🎬 Watch Now: Feature Video
Pratidwani Discussion KCR Strategy : ప్రత్యర్థులకు అందనిరీతిలో పావులు కదిపే గులాబీదళపతి మరోసారి అదే రీతిలో అడుగులు వేశారు. అధికార భారత్ రాష్ట్ర సమితి తరఫున... అందరి కంటే ఒక అడుగు ముందుగానే అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని, 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు. గెలుపుపై పూర్తి ధీమా ప్రకటించిన కేసీఆర్ మదిలో అసలు ఏం ఉంది. ఆయన ఎన్నికల వ్యూహ మేంటి.. ఇవాళ్టి జాబితాలో ఆ 4 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆపారు? సీఎం కేసీఆర్ ఈసారి రెండుచోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారు...? అలానే.. ఒక్క ఉదుటనే 115మంది అభ్యర్థులను ప్రకటించడం... అందులోనూ సిట్టంగ్‌లను పెద్దగా మార్చక పోవడం... వీటన్నింటి వెనక భారాస వ్యూహం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.