మిషన్​ - 17 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా జరగనున్న ఎంపీ ఎన్నికలు - Parliamnet Elections 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 9:49 PM IST

Prathidwani on Parliament Elections : మిషన్‌ -17. తెలంగాణలో ప్రధాన రాజకీయ పక్షాల్లో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఒకవైపు ఇటీవలే గెలిచిన అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్​ పార్టీ ఉండగా, మరోవైపు పోయిన చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో బీఆర్​ఎస్​, ఈ రెండు పార్టీల మధ్య మెజార్టీ స్థానాలపై గురి పెట్టిన బీజేపీ ఉంది. మరి ఈ కీలకమైన మిషన్​లో తమ లక్ష్యాల దిశగా పార్టీల వ్యూహాలు, ఎన్నికలను శాసించబోతున్న అంశాలేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Debate on MP Elections : అయితే ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ‌ఎన్నికల ఫలితాలు రానున్న లోక్‌సభ స్థానాలపై ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? అందుకు భిన్నమైన ఫలితాల్ని ఊహించవచ్చా? కేంద్రంలో అధికారానికి ప్రతి స్థానం కీలకంగా మారిన తరుణంలో కాంగ్రెస్‌ - బీజేపీ ఇక్కడి 17 స్థానాలపై గట్టిగానే దృష్టి పెట్టాయి. మోదీ ప్రచారానికి దీటుగా సోనియాగాంధీనే తెలంగాణ నుంచి పోటీకి దించే సన్నాహాల్లో ఉంది టీపీసీసీ. ఈ ప్రభావాలు ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.