మెట్రో నూతన విధానంపై కొత్త ప్రభుత్వం ప్రణాళికలు - అందరికీ ప్రయోజనం చేకూరేనా? - మెట్రోపై నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-01-2024/640-480-20422515-thumbnail-16x9-pd.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 3, 2024, 9:46 PM IST
Prathidwani on Metro : తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి ప్రయోజనం, ఇదే తమ మెట్రో విధానం అంటోంది కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో ఇప్పటికే తమ ఆలోచనలు ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాయదుర్గం - విమానాశ్రయ మార్గాన్ని పక్కన పెట్టి, నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధ్యమైంత ఎక్కువ కనెక్టివిటీ దిశగా తక్కువ వ్యయంతో కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.
Debate on Metro : ఈ ప్రతిపాదనలపై డీపీఆర్‌ల తయారీ, ట్రాఫిక్ అధ్యయనం వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరి ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచనలతో పాటు, ప్రజల ఆకాంక్షలెలా ఉన్నాయి. నిర్మాణ వ్యయాల తగ్గింపు, అందరికీ అందుబాటులో మెట్రోపై నిపుణులేం సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే నగర జనాభా దాదాపు కోటిన్నరకు చేరింది. ఇలాంటి నగరం భవిష్యత్ అవసరాల కోసం మెట్రోతో పాటు దానికి అనుబంధంగా, సమాంతరంగా ఇంకా ఏమేం చేయవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.