హైదరాబాద్ జంట నగరాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేదెలా? - నగరంలో అగ్నిప్రమాదాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 10:18 PM IST
Prathidwani on Fire Accidents in Hyderabad : హైదరాబాద్ జంట నగరాల్లో అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకుంటున్న విషాదాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ, మండే స్వభావం గల పదార్థాలు, బాణా సంచా ఇలా కారణాలు ఏవైనా గానీ భారీ అగ్నికీలలు భయపెడుతున్నాయి. అగ్ని ప్రమాదాలకు ముఖ్యమైన కారణంగా షార్ట్ సర్క్యూట్ అని తెలంగాణ అగ్నిమాపక విభాగం డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్ తెలిపారు.
Massive Fire Accidents in Hyderabad : అసలు భారీ భవంతులు, ప్రజా రద్దీ ఉండే చోట్ల పాటించాల్సిన అగ్ని ప్రమాదాల నివారణ జాగ్రత్తలేంటి? నగరంలో ఎక్కడ తప్పు జరుగుతోంది? ఇటీవల కరాచీ బేకరి వద్ద ప్రమాదం, అంతకు ముందు సికింద్రాబాద్‌లో వరస ఘటనలు, వీటన్నింటిలో నిపుణులు గుర్తించిన భద్రతాలోపాలు ఏంటి? నివారణ చర్యల విషయంలో ఎక్కడ తప్పు జరుగుతోంది. భద్రత చర్యల్లో భాగంగా తక్షణం సరి చేసుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.