విద్యుత్ బిల్లులకు జత కలిసిన ఏసీడీ ఛార్జీల భారం మోసేదెలా
🎬 Watch Now: Feature Video
Prathidwani రాష్ట్రంలో కొద్ది రోజులుగా దుమారం రేపుతున్నాయి విద్యుత్ బిల్లులకు జత కలసిన ఏసీడీ ఛార్జీలు. ఒక్కసారిగా మోపిన రూ.వందలు, రూ.వేల భారాన్ని ఎలా మోసేది అంటూ పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు. మా ఆదేశాలతోనే ఏసీడీ వసూళ్లని ఈఆర్సీ చెబుతున్నా ప్రజల్లో ఆందోళనలు ఆగడం లేదు. అసలు ఏమిటీ ఏసీడీ ఛార్జీలు? వీటికే ఇలా ఉంటే రానున్న రోజుల్లో నెలవారీ విద్యుత్ బిల్లుల సవరణల నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? ఏసీడీ అయినా, ఎఫ్‌ఏసీ అయినా.. లేదా మరో ఛార్జి అయినా రాష్ట్రంలో కరెంటు బిల్లుల నిర్ణయానికి డిస్కంలు చూపుతున్న కారణాలు సహేతుకంగా ఉన్నాయా? రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల ముందున్న మార్గం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.