prathidwani : పోరు తెలంగాణ.. పార్టీల వ్యూహాలు
🎬 Watch Now: Feature Video
Prathidwani Debate on Telangana Elections : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. కోడ్ కూసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల కోలాహలమే. మరి ఈ సమరభేరీలో ఎవరి వ్యూహం ఏమిటి? పట్టుమని 50 రోజుల వ్యవధి కూడా లేదు. మూడు ప్రధాన పార్టీలు మాత్రం ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెంచరీ కొడతామంటూ అధికారపక్షం.. కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామంటున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్, మోదీపై నమ్మకంతో బీజేపీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Telangana Elections 2023 : 115 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీజేపీ ముందుకు సాగునుందా? ఈ ప్రధాన పార్టీల ముందున్న సవాళ్లు ఏమిటి? అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్(Congress), బీజేపీ వ్యూహాలేమిటి? గతంతో పోల్చితే ఈసారి పార్టీలవారీ లెక్కలెలా ఉండొచ్చు? కేసీఆర్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండనుంది? అసలు ఈ దఫా తెలంగాణ ఎన్నికల ఏ ప్రాతిపదికన జరగబోతున్నాయి. ప్రజల ఆకాంక్షలను అందుకోవడంలో.. పోరు సన్నాహాల్లో ఏ పార్టీ ఎక్కడ ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.