Prathidwani : ఎన్నికల వేళ హోరెత్తిపోతున్న డిజిటల్ ప్రచారాలు.. సవాళ్లుగా మారుతున్న నయా రాజకీయాలు - నేటి ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-10-2023/640-480-19802238-thumbnail-16x9-social-media-campaign.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 18, 2023, 9:54 PM IST
Prathidwani Debate on Social Campaign : ఎన్నికల్లో కీలకఘట్టం.. ప్రచారం. అడుగడుగునా సాంకేతికత నిండిన ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలను ప్రచార వేదికలుగా ఎంత విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి ఆయా పార్టీలు. అసంఖ్యాక పోస్టులతో ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ఈ సమయంలో సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉండనుంది? ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని అధికారులు చెబుతున్నారు.
ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అటువంటి ప్రచారాల్ని అడ్డుకోవడానికి బాధితులకు ఉన్న అవకాశాలు ఏమిటి? పోస్టులు ఫార్వర్డ్ చేసే ముందు వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? పోస్టుల్లో నిజానిజాలు తెలుసుకోవడం ఎలా?మొత్తంగా చూసినప్పుడు.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంలో ఉన్న అనుకూలతలు ఏమిటి? ప్రతికూలతలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.