Prathidwani : సింగరేణి సమరం.. ఎవరి అవకాశాలెలా ఉన్నాయి..?
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2023, 10:51 PM IST
Prathidwani Debate on Singareni Elections Telangana : సింగరేణిలో ఎన్నికల(Singareni Election) సైరన్ మోగింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28న నిర్వహించేందుకు.. ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు వేళాయింది? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముహూర్తం ఖరారు అయింది. సుదీర్ఘ నిరీక్షల తర్వాత అక్టోబర్ 28న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు కూడా రాబోతున్నాయి.
Singareni Elections Schedule Telangana 2023 : హైకోర్టు ఆదేశాలతో అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో కార్మికసంఘాలు, నాయకులంతా ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయారు. కీలక సమయం కావడంతో సింగరేణి కార్మికుల సమస్యలు కూడా తెరపైకి తెచ్చి.. పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తామని హామీలు ఇస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు వచ్చేనెల 10న మధ్యాహ్నం ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. 28న ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రాత్రి 7:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. 6 ఏళ్ల తర్వాత జరగనున్న సింగరేణి సమరంలో ఎవరి అవకాశాలెలా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న రానున్న సింగరేణి పోరు ఫలితాలు ఎవరికి ఎందుకు కీలకం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.