Prathidwani : మెగా "ఢీ"ఎస్సీ.. పోస్టుల సంఖ్య పెంచాలంటూ అభ్యర్థుల ఆందోళనలు - తెలంగాణ డీఎస్సీ అప్డెట్స్
🎬 Watch Now: Feature Video


Published : Aug 30, 2023, 9:50 PM IST
Prathidwani : నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవలే సర్కారు పచ్చజెండా ఊపింది. టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరి జిల్లా ఎంపిక కమిటీలు(DSC) ఈ నియామకాలు చేపడతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
TS DSC 2023 : స్వరాష్ట్రంలో రానున్న ఈ రెండవ డీఎస్సీ ద్వారా 5వేల 89 ఉపాధ్యాయ ఖాళీలు నింపనున్నట్లు ప్రకటించారు. ఈ సంఖ్యపైనే ఇప్పుడు వివాదం నెలకొంది. మాకు... డీఎస్సీ కాదు... మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగులు. వారు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు పలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీకి.. నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న మెగా డీఎస్సీకి తేడా ఏమిటి? ప్రభుత్వం ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.