Prathidwani : చెరువుల పరిరక్షణ ఎలా? - Telangana Govt
🎬 Watch Now: Feature Video
Prathidwani : రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ ఎలా? కొద్దిరోజులుగా అందరిలో ఉన్న ప్రశ్నే ఇది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఓ కేసు విచారణ సందర్భంగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం, ఎఫ్‌టీఎల్ పరిధులు తేల్చడంలో జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు.. హైదరాబాద్ జంటనగరాల్లో కావొచ్చు... జిల్లాల్లో కావొచ్చు.. ఉన్న మొత్తం చెరువులు ఎన్ని? వాటి పరిధులు తేల్చడం, బఫర్‌జోన్ నోటిఫై చేయడం వల్ల ప్రయోజనాలేంటి? హైకోర్టు అడిగింది అనే కాదు... ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం వల్ల ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
అసలు హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిస్థితేంటి? రాష్ట్రంలోని చెరువుల కబ్జాలపై అధ్యయనం జరిగిందా? మొత్తం చెరువులు విస్తీర్ణం ఎంత? ప్రస్తుతం ఎంత ఉంది? ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూమి హక్కుల వివాదాల నేపథ్యంలో చెరువులకు చేటు జరగకుండా ప్రభుత్వం ఏం చేస్తే మేలు జరుగుతుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.