రాష్ట్రంలో ఉన్నత విద్యపై ప్రభుత్వ వ్యూహాలేంటి - విశ్వవిద్యాలయాల బలోపేతం ఎలా? - యూనివర్సిటీలపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/640-480-20478183-thumbnail-16x9-pd.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 10, 2024, 9:22 PM IST
Prathidhwani on Universities : రాష్ట్రంలో ఉన్నత విద్య బలోపేతం, విశ్వవిద్యాలయాల పరిపుష్టం కోసం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతి ముఖ్యమైన ప్రాధాన్యతాంశాల్లో ఇదీ ఒకటిగా ఉంటుంది. ఈ విషయంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం, విశ్వవిద్యాలయాలు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయి? పేరెన్నికగన్న ఉస్మానియా, కాకతీయతో పాటు రాష్ట్రంలో 17 వరకు స్టేట్ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బోధన, బోధనేతర సిబ్బంది అవసరాలు ఎలా ఉన్నాయి? వాటిని పటిష్ఠం చేయాలంటే కొత్త ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏమిటి?
Debate on Universities in Telangana : ఏ సమాజంలో అయినా విశ్వవిద్యాలయాల్లో విద్య, పరిశోధనల ప్రాధాన్యత, మరీ ముఖ్యంగా ప్రభుత్వరంగంలో విశ్వవిద్యాలంగా బలంగా, ధ్రుడంగా ఉండాల్సిన అవసరమేంటి? త్వరలో రాష్ట్ర బడ్జెట్ కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో మన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య రంగం పరిపుష్టికి ఎలాంటి ప్రాధాన్యత, కేటాయింపులు చేస్తే ప్రయోజనకరం? ఆయా అంశాలపై ఇద్దరు నిష్ణాతులు విలువైన సూచనలు, సలహాలు తెలియజేనున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.