Prathidhwani : తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల ప్రభావం ఎలా ఉంది..? కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేంటి..? - తెలంగాణ ఎన్నికలపై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Published : Oct 6, 2023, 10:43 PM IST
Prathidhwani Debate on Telagana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) రంగం సిద్ధమైంది. త్వరలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతుంది. అందుకనుగుణంగా రాజకీయ పార్టీలు, నేతలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో నియోజకవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఒక్క ఓటుకు ఎంత ఇస్తారు..? ఈ విషయంలో సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
చేరాల్సిన చోటుకు ఇప్పటికే చేరాయేమోనని కేంద్ర ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేసింది. ఓటుకు నోటుతో అభివృద్ధి అంధకారం అవుతోంది. ప్రలోభాల విషయంలో అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. నగదు, మద్యం పంపిణీని ఎన్నికల సంఘం అరికట్టలేక పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రజాస్వామ్యానికి హానికరంగా ప్రలోభాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో తాయిలాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడం ఎలా..? ఈ విషయంలో ఓటర్ల బాధ్యత ఏంటి..? అదేవిధంగా ఇప్పటి నుంచే ఎన్నికల కమిషన్ చేయాల్సిన కర్తవ్యం ఏంటి..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.