Prathidhwani : నెరవేరిన TSTRC ఉద్యోగులు, కార్మికుల చిరకాల డిమాండ్.. ఎవరికి ప్రయోజనం..? - Discussion on TSRTC Bill
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-09-2023/640-480-19524221-thumbnail-16x9-rtc-bill-in-telangana.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 15, 2023, 10:44 PM IST
Prathidhwani : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల డిమాండ్ నెరవేరింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు శాసన సభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదించింది. దీంతో ఆ బిల్లు చట్ట రూపం దాల్చింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ జరగనుంది. విలీనం చేయడం వల్ల ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగుల(RTC Employees)కు వస్తున్న పథకాలు, అలవెన్సులు, సౌకర్యాలు ఇప్పటి నుంచి ఎలా ఉంటాాయి..? వారి జీతభత్యాలను ఎలా నిర్ణయిస్తారు?
Next Procedure on TSRTC Bill : పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేశారు. ఆ అనుభవాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోబోతున్నారు. ఎలాంటి అంశాల పట్ల విస్తృతంగా పరిశోధన చేయాలి? ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఏం కోరుకుంటున్నారు..? ఈ విలీనం చేయడం వల్ల ఆర్టీసీ సంస్థకు, ప్రజలకు ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందా? కార్మికులు, ఉద్యోగులకు పని వేళలు ఎలా ఉంటాయి? ఇలాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని.