People Fish hunting in Karimnagar : రోడ్డుపై పారుతున్న వరద నీరు.. చేపల వేటలో ప్రజలు - కరీంనగర్లో రోడ్డుపై చేపలు పడుతున్న ప్రజలు
🎬 Watch Now: Feature Video
Ponds filled with rainwater in Karimnagar district : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలో వరద నీటితో చెరువులన్నీ నిండిపోయాయి. భారీగా వర్షం నీరు వస్తున్నందున.. రోడ్డుపై నీరు పారుతుంది. నీటితో పాటు అప్పుడప్పుడు చేపలు కూడా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. సుమారు 10 కిలోలకు మించకుండా చేపలు దొరుకుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టిన ప్రతి వ్యక్తి ఆనందంగా చేపలతో ఫొటోలు దిగుతున్నారు. వీటిని చూసేందుకు స్థానికులు అధిక సంఖ్యలో చెరువుల దగ్గరికి వస్తున్నారు. మరికొన్ని చెరువుల దగ్గర నీరు రోడ్డుపై మోకాలు వరకు వస్తున్నందున వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. భారీ వావానాలు వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనాలు క్యూలైన్లు కడుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వర్షపు నీరు చేరి మురుగు నీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పలువురు నగరవాసుల ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం జిల్లాలో సగటు వర్షపాతం 29.6 మిల్లీమీటర్లు నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.