భోజనం కూడా ఏర్పాటు చేయలేదని పోలింగ్ సిబ్బంది ఫైర్
🎬 Watch Now: Feature Video
Polling Staff Fires on Election Officers over Arrangements : జనగామలో డీఆర్‌సీ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయలేదని.. ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. తమలో కొందరికి బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నాయని.. భోజనం లేకపోతే తమకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కొంతమంది మహిళలు ఆకలి తట్టుకోలేక.. కేవలం ఆకు కూరలు తిన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించినా కనీస వసతులు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రేపే పోలింగ్ తేదీ కావడంతో ఎన్నికల సిబ్బంది ఆయా డీఆర్‌సీ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొననున్నారు.