తుది అంకానికి చేరుకుంటోన్న ఎన్నికల ప్రచారఘట్టం -మరి ఓటర్ల దారి ఎటువైపో?

🎬 Watch Now: Feature Video

thumbnail

Political Parties Finally Election Campaign Today Prathidwani : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారఘట్టం.. తుదిఅంకానికి చేరుకుంటోంది. నిర్ణయాత్మక పోరులో ఇంకా వారం రోజులే సమయం మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు మరింత పెంచాయి. ముఖ్యనేతలు అందరు.. సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. వరస పర్యటనలు, భారీ సభలతో పాటు సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీని కూడా పతాకస్థాయికే తీసుకు వెళ్తున్నారు. అన్ని పార్టీల నాయకులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఎత్తులతో ముందుకు వెళుతున్నారు.

అయితే తామే ఎందుకు రావాలో, ప్రత్యర్థులు ఎందుకు రావొద్దో వివరిస్తున్న పార్టీలు.. ఇంటింటి ప్రచారం చేస్తూ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విమర్శలు.. చివరి వారానికి పార్టీల ప్రచార వ్యూహాలు ఎలా మారనున్నాయి? వారిపై వస్తున్న విమర్శలు, ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతున్నాయి? ఆఖరి అంకం ప్రచార రేసులో ఎవరు ఎక్కడ? ఈసారి తెలంగాణ ఓటర్ల బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ.. ఏ పార్టీల వైపు మొగ్గు చూపుతారో ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.