Police Seized 40kg Gold in Chityala : చిట్యాలలో పోలీసుల తనిఖీలు.. 40 కిలోల బంగారం, 190 కిలోల వెండి స్వాధీనం - Police seized 40 kg gold in Chityala

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 10:30 PM IST

Police Seized 40kg Gold in Chityala at Nalgonda District : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో.. అధికార, పోలీసు యంత్రాంగం.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు క‌లిసి ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు, డ్ర‌గ్స్, మ‌ద్యంతో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువులు భారీగా పట్టుబడుతున్నాయి. తాజాగా ఈరోజు నల్గొండ చిట్యాల వద్ద  హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Police Conduct Extensive Checking in Telangana : ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న రెండు బోలోరో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రెండు వాహనాలలో ఉన్న 40 కిలోల బంగారం, 190 కిలోల వెండిని గుర్తించారు. వాహనదారులు ఇందుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు (Police Seized). అయితే జ్యువెలరీ షాప్‌కు చెందిన బంగారం, వెండి అని వాహనదారులు పోలీసులకు తెలిపారు. మరోవైపు ఇప్పటివరకూ తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము రూ.200 కోట్లు దాటింది. మొత్తం రూ.243.76 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.