ట్రాఫిక్​ సిగ్నల్​ బ్యాటరీల చోరీ.. వామ్మో ఇలా కూడా చేస్తారా? - telangana latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2023, 5:32 PM IST

Police caught thieves of signal batteries in hyderabad: హైదరాబాద్​లో​ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమవుతుంటే మరోవైపు నగరంలో నేర నియంత్రణ చేయడం మాత్రం కత్తిమీద సాములా మారుతోంది. నగరంలో నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసిన దొంగతనాలు మాత్రం ఆగడంలేదు. రాత్రివేళల్లో ఏకంగా నడిరోడ్డుపై ట్రాఫిక్​ పోలీసు రద్దీ నియంత్రించే కూడలి ప్రాంతంలో ట్రాఫిక్​ సిగ్నల్​ బ్యాటరీలను దొంగిలిస్తున్నారు. ఈ చోరీలు గత కొంత కాలంగా సాగుతున్న పోలీసులకు చిక్కడంలేదు. ఏట్టకేలకు పోలీసులు పక్కా స్కెచ్​ వేసి దొంగలను పట్టుకున్నారు

హైదరాబాద్ నగరంలోని గత కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో వరుసగా ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న నిందితులను వలపన్ని అబిడ్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అబిడ్స్ పోలీస్​ స్టేషన్ పరిధిలో సిబ్బందితో కలిసి పట్టకున్నారు. షేక్ అజీముద్దిన్ అలియాస్ అజీమ్, జంగాల మద్దిలేటి అను నిందితులు బేగంబజార్, బేగంపేట్, కాచిగూడ, లంగర్​హౌజ్, హబీబ్​నగర్, గోపాలపురం, మలక్​పేట, షహినయాత్గాంజ్, సైఫాబాద్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను చోరి చేశారని పోలీసులు తెలిపారు. 

ఇందులో 26 పెద్ద బ్యాటరీలు, 48 చిన్న బ్యాటరీలు ఉన్నాయని వెల్లడించారు. వీటి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వీరిపై హైదరాబాద్ నగరంలో చైతన్యపురి పోలీసుస్టేషన్లలో 11 కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. చాకచక్యంతో పట్టుకున్న ఈ నిందితులపై సెక్షన్ 379 కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా వీరిని పట్టుకోవడంలో సఫలమైన పోలీస్​ స్టేషన్ సిబ్బంది ఎస్ఐలు ఎన్. గౌరెందర్ గౌడ్, కె.నిరంజన్, కానిస్టేబుల్స్ రాజ్​కుమార్, రతన్, రవికుమార్​ల ప్రతిభను పోలీసు అధికారులు అభినందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.