Podem Veeraiah Celebrates Getting a Congress Ticket : రెండోసారి కాంగ్రెస్ టికెట్ రావడం పట్ల.. పొదెం వీరయ్య సంబురాలు - MLA Podem Veeraiah latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 4:14 PM IST

Podem Veeraiah Celebrates Getting a Congress Ticket : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. మొదటి జాబితాలోని 55 మంది పేర్లను ప్రకటించారు. సామాజిక వర్గాల వారీగా దక్కిన సీట్లు రెడ్డిలకు అత్యధికంగా 17 నియోజకవర్గాల్లో టికెట్లు దక్కగా, బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, వెలమ 7, బ్రాహ్మణ 2, ముస్లిం 3 లెక్కన టికెట్లు కేటాయించారు. అయితే ఈరోజు ప్రకటించిన జాబితాలో తన పేరు ఉండటం పట్ల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య (Podem Veeraiah) ఆనందం వ్యక్తం చేశారు. 

Telangana Assembly Elections 2023 : ఈ సందర్భంగా పొదెం వీరయ్య భద్రాద్రి సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్​లో.. అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. భద్రాద్రి రామయ్య, భద్రాచలం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లనే రెండోసారి పోటీచేసే అవకాశం వచ్చిందని పొదెం వీరయ్య అన్నారు.రెండోసారి కూడా తనను ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తద్వారా నియోజకవర్గ సమస్యలతో పాటు.. జిల్లా సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని పొదెం వీరయ్య పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.