మంచిర్యాలలో బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు - చూసేందుకు కాలనీ వాసుల ఆసక్తి - మంచిర్యాలలో గులాబీ రంగు నీరు
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 2:56 PM IST
Pink Colour water In Mancherial : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలోని ఓ ఇంట్లో బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు రావడం చర్చనీయాంశం అయింది. పట్టణానికి చెందిన శ్రీనివాసచార్యులు ఆర్ఎంపీ వైద్యులుగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం నీళ్లు పట్టేందుకు బోరు వేశారు. దీంతో గులాబీ రంగు నీళ్లు రావడంతో ఆశ్చర్యానికి గురైయ్యాడు. వెంటనే ఆ నీళ్లను పారబోసి మరో బకెట్లో నీటిని పట్టాడు. ఎన్నిసార్లు ఇలా చేసినా గులాబీ రంగు నీళ్లు వస్తున్నడంతో విస్తు పోయాడు. కొంత సేపు బోరు అలానే వేసి వేచి చూశాడు.
Pink Colour Water Video Viral In Mancherial : ఎంతసేపటికి నీళ్ల రంగు మారక పోవడంతో, శ్రీనివాసచార్యులు పక్కింట్లో నీటిని పరిశీలించగా మామూలు నీరే వస్తూ ఉండడంతో అవాక్కయ్యారు. ఈ విషయం పట్టణంలో విస్తృతంగా ప్రచారం కావడంతో నీటిని చూసేందుకు కాలనీ వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు వచ్చి పరిశీలించాలని శ్రీనివాసచార్యులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సొషల్ మీడియాలో వైరల్గా మారాయి.