హైటెక్స్ ఎగ్జిబిషన్లో పెటెక్స్ షో - ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న పెట్ షో - పెట్ కేర్ పెట్ ఎగ్జిబిషన్ 2023
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 9:02 PM IST
Petex India Exhibition 2023 : హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో పెటెక్స్ ఇండియా షో ఏర్పాట్లు మొదలయ్యాయి. నగరంలో జరుగుతున్న పెటెక్స్ షో ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు హైటెక్స్ ఎగ్జిబిషన్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ ప్రదర్శనలో శునకాలు, పిల్లులు పక్షులు, పలు జాతులకు చెందిన విభిన్న రకాల జంతువులు అందుబాటులో ఉంటాయన్నారు.
Petex Premier Exhibition 2023 : దేశీయ మార్కెట్లో పెంపుడు జంతువుల వ్యాపారం రూ. పది వేల కోట్ల విలువకు చేరుకుందని, దాదాపు రెండు కోట్ల పెంపుడు కుక్కలను ప్రజలు పెంచుకుంటున్నారని శ్రీకాంత్ తెలిపారు. వీటికి పోటీగా పిల్లుల పెంపకం పెరిగిందని.. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి పెంపుడు జంతువులపై మక్కువ పెరిగిందని చెప్పారు. పెంపుడు జంతవుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్, సుందరికరణ ఉత్పత్తుల వ్యాపారం పుంజుకుందన్నారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.