అందమైన చేపలు, పలకరించే చిలుకలు - హైటెక్స్​లో సందడిగా పెటెక్స్​ ఆండ్​ కిడ్స్​ ఫెయిర్ షో - పెటెక్స్ పెట్ కేర్ ఎగ్జిబిషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 7:59 PM IST

Petex India Exhibition 2023 : హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో కిడ్స్ ఫెయిర్, పెటెక్స్ షో ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పెటెక్స్ షో ఆండ్​ కిడ్స్ ఫెయిర్ ఈ నెల 22 నుంచి 24 వరకు జరుగుతుందని నిర్వాహకులు, పెటెక్స్ సభ్యులు చందు తెలిపారు. 

Petex Pet Care Exhibition : మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో పెంపుడు జంతువుల కోసం ఆహార పదార్థాలు, వాటి గ్రోమింగ్​ కోసం ఉపయోగించే సుందరీకరణ ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయని చందు పేర్కొన్నారు. పెటెక్స్​ షోలో పలు జాతులకు చెందిన శునకాలు, పిల్లులు, పక్షులు, చేపలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రదర్శనలో పెంపుడు శునకాలతో విన్యాసాలు, ఫ్యాషన్​ షో ఉంటుందని తెలిపారు. కిడ్స్​ ఫెయిర్​లో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, ఆట వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.