నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది : పవన్​ కల్యాణ్ - మోదీ గురించి పవన్​ స్పీచ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 7:02 PM IST

Pawan Kalyan Speech in BJP BC Atma Gourava Sabha : బీజేపీకి, జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని అన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టమైన అంశంగా పరిగణించారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని.. బీజేపీకు జనసేన సంపూర్ణ మద్దతు(Janasena Support BJP) ఇస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రధానికి అండగా నిలబడతామని.. భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం కాకుడదని చెప్పారు.  

Janasena Support BJP in Telangana : సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని.. జల్‌, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమమని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్‌ 370 రద్దు చేసేవారు కాదని.. ఎన్నికలనే మోదీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదని.. అందులో ఒకటి ఆర్టికల్‌ 370 రద్దు, మహిళాబిల్లు ఆమోదం ఇలాంటి ఎన్నో మార్పులు చేశారని హర్షం వ్యక్తం చేశారు. తనలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ అని ప్రశంసించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.