జనసేన పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం నల్గొండ జిల్లా : పవన్ - సూర్యపేటలో పవణ్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 4:14 PM IST
Pawan Kalyan Election Campaign in Suryapet : నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని.. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావును గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పవన్ పేర్కొన్నారు.
జనసేన పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం నల్గొండ జిల్లా అని.. జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య చూసి చలించిపోయానని వాపోయారు. కనీసం బాధితులకు ప్రభుత్వం మంచినీరు అందించకపోవడం బాధ కలిగించిందన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచామన్న పవన్.. ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ యువత దగా పడిందని భావించి.. వారి పక్షాన నిలబడేందుకు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్నాని అన్నారు. కులం, మతం ప్రాంతాలకు అతీతంగా అందరిని సమానంగా చేసే నేత ప్రధాని మోదీ అని పవన్ అభిప్రాయపడ్డారు.