thumbnail

By

Published : Aug 17, 2023, 1:12 PM IST

ETV Bharat / Videos

Orphan Girl Rudra Rachana Interview : కేటీఆర్​ సాయంతో సాఫ్ట్​వేర్ ఇంజినీర్.. ఇప్పుడు సీఎం సహాయనిధికి రూ. లక్ష విరాళం

Orphan Girl Rudra Rachana Interview : మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాాయం చేస్తే.. మన స్థాయికి తగ్గట్టుగా వారికి తిరిగి ఏదో బహుమానం ఇస్తాం.. కానీ ఈ యువతి మాత్రం తను ఉన్న పరిస్థితుల్లో తనకి ఎలా సహాయం చేశారో.. అలా తనలా అసహాయ స్థితిలో ఉన్న వారికి సాయం చేయాలి అనుకుంది. తనకు చేసిన సహకారాన్ని మరవకుండా ఉద్యోగం సంపాదించి.. తనలాంటి ఎంతో మందికి తోడ్పాటుగా నిలుస్తోంది. చదువంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. కానీ, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కొల్పోయి చదువుకోవడానికి  అనేక  ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె కష్టాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్​ అండగా నిలిచి ఇంజినీరింగ్‌ చదివించారు. ఫలితంగా ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని సంపాదించింది.  అక్కడితో ఆగిపోని ఆ యువతి తనలాంటి వారికి అండగా ఉండేందుకు ముందుకొచ్చింది. అందుకు తన వేతనంలోని లక్ష రూపాయలను సీఎం సహాయ నిధికి అందజేసి గొప్ప మనసును చాటుకుంది. తనే జగిత్యాల జిల్లాకు చెందిన రుద్ర రచన. మంచి మనసుతో ఎంతో మందికి స్ఫూర్తిగా  నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తన ప్రస్థానం, భవిష్యత్‌ లక్ష్యాలను ఆమె మాటల్లోనే విందాం..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.