Private Travel Bus Fire Accident : ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం - ట్రావెల్స్​ బస్సులో అగ్ని ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 2, 2023, 8:23 PM IST

Private Travels Bus Catches Fire : బాలానగర్ నుంచి కూకట్​పల్లి వై జంక్షన్ వైపు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్​కు చెందిన బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్​పీ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా ఇంజన్​ నుంచి భారీ శబ్ధంతో మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్​ప్రయాణికులను దించేయడంతే పెను ప్రమాదమే తప్పినట్లు అయింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. 

బస్సులో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణికులు, ఆ బస్సు చుట్టు పక్కల వాళ్లు, వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం కారణంగా బాలానగర్​ నుంచి వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోవడం.. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అక్కడు ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.