రూపాయికే చీర అంటూ ఆఫర్ - కస్టమర్లను చూసి దుకాణం మూసేసిన యజమాని - one rupee Saree issue
🎬 Watch Now: Feature Video
Published : Jan 9, 2024, 8:00 PM IST
One Rupee Saree Selling at Bhadrachalam : షాప్‌కు పబ్లిసిటి బాగా జరగాలంటే ఓపెనింగ్‌కు సెలబ్రిటీని తీసుకురావాలి. మన బడ్జెట్ ఆ స్థాయిలో లేకుంటే డిఫరెంట్‌గా ఆలోచించాలి. అందుకోసం తక్కువ ధర అయితే ఎక్కువ మంది వస్తారని, ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఒక్క రూపాయికే చీర ఇస్తామని రెండు రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయించాడు. ఈ ప్రచారం చూసి మహిళలు ఊరుకుంటారా.. పొద్దున్నే దుకాణం ముందు బారులు తీరారు.
One Rupee Saree in Bhadrachalam : భారీగా తరలివచ్చిన మహిళలు దుకాణం ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూడ సాగారు. ఆలస్యం కావడంతో యజమానిని తిట్టుకోవడం ప్రారంభించారు. నింపాదిగా వచ్చిన షాపు యజమాని వారందరిని తప్పించుకొని షాప్ ఒపెన్ చేశాడు. అంతే ఒక్కసారిగా మహిళలంతా లోనికి ఎగబడ్డారు. వారంతా అలా తోసుకుంటూ రావడంతో యజమాని భయపడిపోయాడు. అందరిని బయటకు నెట్టేసి షాపు మూసేశాడు. పొద్దున్నే ఈ గలాటా గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ఇలా చేసినందుకు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది.